Vizag to Tirupati 2nd Vande Bharat Train Full Details
Vizag to Tirupati 2nd Vande Bharat Train – ప్రయాణికులకు ఇక పండగే
తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ప్రజల అవసరాలు రైళ్ల రద్దీ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్రం తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లకు ఏపీ తెలంగాణలో మంచి ఆదరణ లభిస్తోంది. ప్రయాణం సమయం తక్కువగా ,సౌకర్యవంతమైన సీటు అలాగే ఇతర ఫీచర్లు ఉండడంతో చాలా మంది ఈ ట్రైన్స్ ను ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ లు ఏర్పాటు చేయాలంటూ పలుచోట్ల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. విశాఖ నుంచి తిరుపతికి నడపాలని ప్రజలు కోరుతున్నారు. అయితే త్వరలోనే ఆ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి నిత్యం లక్షలాది మంది ప్రజలు తరలి వెళ్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది రైళ్ల ద్వారా ప్రయాణం చేసి తిరుపతికి చేరుకుంటారు. అందుకే తిరుపతికి వెళ్లే రైళ్లన్నీ నిత్యం నిండుగా కనిపిస్తాయి. విశాఖ నుంచి మరింత రద్దీ ఉంటుంది. దీంతో విశాఖ నుంచి తిరుపతికు వందే భారత్ కేటాయించాలని ఎంపి శ్రీ భరత్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసిన విశాఖ ఎంపి శ్రీ భరత్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ నిర్మాణంపై ముందడుగు వేసినందుకు కృతజ్ఞతలు తెలిపి, వాల్తేరు డివిజన్ ను అలాగే కొనసాగించాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. అలాగే విశాఖపట్నం తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నడపాలని కోరారు. దాంతో పాటు విశాఖపట్నం అదేవిధంగా సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు దువ్వాడలో షాపింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం బెంగళూరు మధ్య ప్రతిరోజు రైలు నడపాలని వినతి పత్రం సమర్పించారు. ఎంపీ విజ్ఞప్తులకు కేంద్రం నుంచి నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో త్వరలోనే విశాఖ 2 తిరుపతికి వందే భారత్ పరుగులు తీయనుంది. కొద్ది రోజుల కిందట విశాఖ నుంచి దుర్గ్ వందే భారత్ ప్రారంభమైంది. దీనికి ఆశించిన స్థాయిలో ఆదరణ లేదని రైల్వే అధికారులు గుర్తించారు. ఈ రైలుకు మరిన్ని భోగీలు కేటాయించి విశాఖ తిరుపతి మధ్య కొనసాగించే ప్రతిపాదన పైన చర్చ జరుగుతోంది. అయితే ఈ నిర్ణయం అమరులో వచ్చే సమస్యల పైన అధికారులు అధ్యయనం చేస్తున్నారు. విశాఖ నుంచి తిరుపతికి వందే స్లీపర్ కేటాయించాలనేది రైల్వే అధికారుల మరో ప్రతిపాదన పైన కసరత్తు చేస్తున్నారు. దీని కారణంగా దూర ప్రయాణం కావడంతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి రెండు రైళ్లు తిరుపతి బెంగళూరు నాగపూర్ నగరాలకు ఒక్కొక్కటి చొప్పున నాలుగు వందే భారత్ ట్రైన్లు రాకపోకలు సాగిస్తున్నాయి. విశాఖ నుంచి దుర్గ్ ఓ వందే భారత్ నడుస్తోంది ఇప్పుడు విశాఖ నుంచి తిరుపతికు మరో ట్రైన్ పరుగులు తీస్తే ప్రయాణికులకు ఇక పండగే.