CRICKET

Vaibhav Suryavanshi IPL Auction 2025 – 13 Years Age Boy

Vaibhav Suryavanshi Price In IPL Mega Auction – BCCIని మోసం చేశాడా?

ఐపిఎల్ 2025 కి సంబంధించి మెగా ఆక్షన్ అయితే పూర్తి అయిపోయింది. రెండు రోజులు జరిగిన ఈ మెగా ఆక్షన్ లో చాలా మంది ప్లేయర్లు అయితే సోల్డ్ అవుట్ అయ్యారు. అలాగే కొంతమంది ప్లేయర్లు అన్సోల్డ్ గా కూడా మిగిలిపోయారు .కొన్ని అందులో షాకింగ్ అన్సోల్డ్స్ కూడా ఉన్నాయి. డేవిడ్ వార్నర్ కావచ్చు, ఇంకా మిగతా ప్లేయర్లు కావచ్చు. కొన్ని అన్సోల్డ్ గా మిగిలిపోయిన ప్లేయర్లు అయితే ఉన్నారు కొంతమంది. సో ఈ ఆ తర్వాత ఆక్షన్ తర్వాత ఏ టీం స్ట్రాంగ్ గా ఉంది ఏ టీం వీక్ గా ఉంది ఈ డిస్కషన్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ ఐపిఎల్ మెగా ఆక్షన్ లో ఒక సెన్సేషన్ గురించి మాట్లాడుకుంటే వైభవ్ సూర్యవంశి ఈ కుర్రాడు కేవలం 13 ఏళ్ల వయసులోనే ఐపిఎల్ ఆక్షన్ లో ఒక టీం కి ఎంపిక అయ్యాడు. ఆ ఒక టీం తనని పిక్ చేసుకుంది తనని బై చేసింది. ఐపిఎల్ లో అతి పిన్న వయస్కుడిగా తను డెబ్యూ అయితే చేయబోతున్నాడు. తన ఎంట్రీ ఐపిఎల్ లో ఇవ్వబోతున్నాడు. ఆ ప్లేయర్ పేరే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వైభవ్ సూర్యవంశి. బీహార్ కు చెందిన ఈ కుర్రాడు కేవలం 13 ఏళ్ల వయసులోనే ఐపిఎల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సో ఇంత చిన్న వయసులో ఈ అబ్బాయికి దాదాపు కోటి 10 లక్షల వరకు ఇతనికి ప్రైస్ ఇచ్చి రాజస్థాన్ అయితే తమ టీం లోకి తీసుకుంది.

సో 13 ఏళ్ల వయసులోనే ఈ అబ్బాయి కరోడ్పతి అయ్యాడంటూ సోషల్ మీడియాలో కూడా తన పేరు మారుమోగిపోతుంది. ఆ మీమ్స్ గాని రీల్స్ గాని ఈ అబ్బాయి పై చేస్తూ ఉన్నారు విపరీతంగా. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశి అయితే ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో కరోడ్పతి అవ్వడం ఒక సెన్సేషన్. అయితే ఈ అబ్బాయి పై ఇంకో ఆరోపణలు వస్తుంది ఏంటంటే అతను ఏజ్ తప్పుగా తీసుకున్నాడని అంటే తప్పుడు ఏజ్ చెప్పి bcci ని మోసం చేశాడు అనే ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. అయితే ఈ విషయంపై అసలు నిజంగానే ఆ కుర్రాడు bcci ని మోసం చేశాడా తన ఏజ్ తప్పుగా చెప్పి ఇన్ని రోజులు ఆడుతున్నాడా అంటే, చాలా మంది స్పోర్ట్స్ మ్యాన్స్ పైన ఉండే ఒక ఆరోపణలు ఏందంటే వాళ్ళు ఎక్కువ కాలం కెరియర్ లో ఉండడానికి ఏజ్ ను తక్కువగా చూపిస్తూ సర్టిఫికెట్స్ తీసుకుంటారు అనే ఒక ఆరోపణ అయితే గతం చాలా కాలం ఉంది. చాలా మంది ప్లేయర్స్ మీద కూడా ఉంది. కొంతమంది ప్లేయర్లు ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళు బహిరంగంగా కూడా ఒప్పుకున్నారు. మేము ఏజ్ తప్పుగానే అప్పుడు చెప్పాము. యాక్చువల్ గా మా ఏజ్ ఇది మేము ఇంత తక్కువ చేసుకున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ కుర్రాడు 13 ఏళ్ల కుర్రాడైన సూర్యవంశి పై కూడా ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి.

తన ఏజ్ తప్పుగా చెప్పాడు అని సో ఈ ఆరోపణలపై వాళ్ళ నాన్నగారు సంజీవ్ గారు తాజాగా స్పందిస్తూ ఒక ఛాలెంజ్ కూడా విసిరారు. అందరికీ ఆ మా అబ్బాయి మా అబ్బాయి ఏజ్ కరెక్ట్ యాక్చువల్ గా ఇప్పుడు మేము చెప్తున్నదే దాంట్లో ఎలాంటి తప్పు లేదు. మేము ఎవరిని మోసం చేయలేదు కావాలంటే ఎవరైనా బోన్ టెస్ట్ చేయించుకోవచ్చు. కానీ అంటే వయస్సు నిర్ధారించే ఒక టెస్ట్ అయితే ఉంటది దాన్ని బోన్ టెస్ట్ అంటారు. ఆ బోన్ టెస్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ వయసు ఎంత అనేది కూడా ఆ రిపోర్ట్లలో వస్తది. సో అలాంటి ఏజ్ ని bcci గతంలోనే అండర్ 19 ఆడుతున్నప్పుడే ఆ అంతకంటే ముందే కూడా bcci ఈ సూర్యవంశికి బోన్ టెస్ట్ చేసిందని అందులో కరెక్ట్ ఏజ్ ఏ వచ్చిందని ఆ అదే కంటిన్యూ అవుతుందని కూడా వాళ్ళ నాన్నగారు అయితే వెల్లడించారు. ఇప్పటికి కూడా అలాంటి ఆరోపణలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఎవరికీ భయపడేది లేదు కావాలంటే మరోసారి కూడా ఆ ఏజ్ నిర్ధారించే టెస్ట్ ని మేము ఆ బోన్ టెస్ట్ ని చేయించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఒక ఛాలెంజ్ ని అయితే వేశారు .సో ఇప్పుడు ఇంత తక్కువ ఏజ్ లో ఇంత పాపులారిటీ గాని ఇంత అమౌంట్ గాని ఐపిఎల్ లాంటి ఒక బిగ్ ఈవెంట్ లో ఆడే అవకాశం వచ్చినప్పుడు సాధారణంగా ఇలాంటి ఆరోపణలు అయితే వస్తూనే ఉంటాయి. వాటికి రైట్ టైం లో వాళ్ళ నాన్న అయితే రియాక్ట్ అయ్యి ఒక ఛాలెంజ్ కూడా ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్ కూడా విసరడం జరిగింది. సో ఇలాంటి ఆరోపణలన్నీ మనము అంత సీరియస్ గా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు .కచ్చితంగా అతను హైలీ టాలెంటెడ్. జస్ట్ 12 ఏళ్ల వయసు తర్వాతనే ఆస్ట్రేలియా తో జరిగిన అండర్ 19 మ్యాచ్ లో ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో జరిగిన మ్యాచ్ లో కేవలం 50 బంతుల్లోనే సెంచరీ కొట్టేసాడు. సో మంచి డొమెస్టిక్ క్రికెట్ లో మంచి ఆ పర్ఫార్మెన్స్ చేస్తున్న తనని ఐపిఎల్ టీమ్స్ అనేవి ఫోకస్ పెట్టి, ఇలాంటి కుర్రాళ్ళు మన టీం లో ఉంటే బాగుంటుందని రాజస్థాన్ అయితే అతన్ని పిక్ చేసుకోవడం జరిగింది. సో రాజస్థాన్ ఫస్ట్ నుంచి కూడా యంగ్ ప్లేయర్లని వాళ్ళపై నమ్మకం పెట్టి వాళ్ళని తీసుకొని వాళ్ళని ట్రైన్ చేసి సూపర్ స్టార్ గా మార్చిన చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. యూసుఫ్ పఠాన్ కావచ్చు, రవీంద్ర జడేజా కావచ్చు, రాజస్థాన్ నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు రీసెంట్ గా సంజూ సామ్సన్ కావచ్చు, అలాగే రియాన్ పరాగ్ కావచ్చు, ధ్రువ్ జురేల్ కావచ్చు వీళ్ళందరినీ రాజస్థాన్ ఓన్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ లాంటివి ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ క్రికెట్ డెవలప్ అవ్వడానికి ఎంతో హెల్ప్ చేసి ఒక యంగ్ టాలెంట్ ని అయితే వాళ్ళు ఆ ఎదగేందుకు వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు.

అందులో భాగంగానే ఇలాంటి టాలెంటెడ్ ఉన్న ఇలాంటి మంచి టాలెంట్ ఉన్న ఈ సూర్యవంశి లాంటి ప్లేయర్లను కూడా రాజస్థాన్ వాళ్ళు పిక్ చేసుకొని వాళ్ళని ఇంకా బెటర్ గా తయారు చేసి టీం ఇండియా కి అందించడంతో పాటు వాళ్ళ ఫ్రాంచైజీ కి ఉపయోగపడేలా ఆడేలా చేసుకోవడం వాళ్ళ ప్రత్యేకత. అందులో భాగంగానే ఈ సూర్యవంశిని వాళ్ళు పిక్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఏజ్ విషయంలో వస్తున్న ఆరోపణలు అయితే ఆ అంత నిరాధారమైన ఆరోపణలుగానే కనిపిస్తున్నాయి. సో మరి ఈ విషయంపై వాళ్ళ నాన్న ఇచ్చిన ఛాలెంజ్ ని ఎవరైనా స్వీకరిస్తారా అలాంటివి ఏం జరగవు. నాకు తెలిసి మోస్ట్లీ సో bcci కూడా ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఒక పర్టికులర్ గానే ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళని అలా వదిలేస్తే మిగతా వాళ్ళు కూడా అలా చేసే అలా మోసానికి పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్వరి విషయంలో కూడా అంత ఈజీగా అయితే ఉండదు .కచ్చితంగా ఆ ముందే ఇలాంటి టెస్టులు అవన్నీ చేస్తానే ఉంటది bcci అందరి విషయంలో ఫిట్నెస్ టెస్టులతో పాటు ఇలాంటివి కూడా చేస్తా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *