Freedom At Midnight Webseries Review Telugu
Freedom At Midnight Webseries Review Telugu – ఎలా ఉందంటే
sony లో స్ట్రీమ్ అవుతున్న ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ సిరీస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది .ఓవరాల్ గా సిరీస్ చూసిన తర్వాత నాకైతే మంచిగా అనిపించింది. ఇదేంటంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన సిరీస్ అన్నమాట. మన ఇండియా అండ్ పాకిస్తాన్ రెండు పార్టీషియన్ ఎలా జరిగింది. దీని మధ్యలో జరిగిన పాలిటిక్స్ ఏంటి అన్న విషయం గురించి ఈ సిరీస్ లో మనకి చూపించడం జరిగింది. ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అనే బుక్ ని అడాప్ట్ చేసుకొని ఈ సిరీస్ ని అయితే తెరకెక్కించారు. ఫస్ట్ టు ఎపిసోడ్స్ నాకు కొంచెం స్లో గా వెళ్తుందేమో అన్నట్టుగా అనిపించింది. కానీ తర్వాత ముందుకెళ్లే కొద్దీ ఇంట్రెస్టింగ్ గా అయితే మారింది. ఈ సిరీస్ యొక్క కాస్టింగ్ ని మెచ్చుకోవాలి. లుక్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ వరకు ఇరగదీశారు అనుకోండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మహమ్మద్ అలీ జిన్నా గారు, మహాత్మా గాంధీ గారు, సరోజిని నాయుడు గారు ఈ క్యారెక్టర్స్ యాస్ ఇట్ ఇస్ ప్రింట్ దిగిపోయారు అన్నట్టుగా కనిపిస్తారు. మనకి జవహర్లాల్ నెహ్రూ గారి క్యారెక్టర్ ఏంటంటే కాస్త సన్నబడి పొడుగ్గా అయ్యారేమో అన్నట్టుగా అనిపించింది. లుక్ వైస్ కాకపోతే పర్ఫార్మెన్స్ వైస్ మాత్రం చాలా బాగా చేశారన్నమాట. టోటల్ గా ఇందులో సెవెన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అందులో పంజాబ్ ఎపిసోడ్ అయితే కొంచెం హార్డ్ హిట్టింగ్ గా కూడా అనిపించింది. అంటే మత గొడవలు జరగడం వల్ల ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ గొడవల్లోని ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వీటిని చాలా బాగా చూపించారు. టోటల్ 7ఎపిసోడ్స్ లోని పంజాబ్ ఎపిసోడ్ లో ఉండే ఎమోషన్స్ అయితే ఇంకా బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ సిరీస్ విషయంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ ని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. 1946 అండ్ 47 ఆ టైం లైన్ ఎలా ఉంటుందో అది యాస్ ఇట్ ఇస్ స్క్రీన్ మీద మనకి ప్రెసెంట్ చేశారు. ఆ ఆర్ట్ వరకు అయితే చాలా రియలిస్టిక్ గా ఉంటది. చూసేటప్పుడు మనం ఏంటంటే ఆటోమేటిక్ గా ఆ టైం లైన్ లోకి వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉంటది అన్నమాట. ఇది కంప్లీట్ డ్రామా అన్నమాట. కాస్త స్లో పేస్డ్ గా అయితే ఉంటది నాకేంటంటే ఫస్ట్ టు ఎపిసోడ్సే స్లైట్ గా బోరింగ్ అనిపించింది. కానీ ముందుకెళ్లే కొద్దీ అంత బోరింగ్ అయితే అనిపించలేదు. ఇన్ఫాక్ట్ కాస్త ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించింది. మనం కాని క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయితే సిరీస్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ సిరీస్ లో నాకు ఏమనిపించింది అంటే హార్డ్ హీటింగ్ మూమెంట్స్ ఇంకొంచెం బెటర్ గా ప్రెసెంట్ చేసి ఉంటే బాగుండును.
ఇంకొంచెం ఎక్కువగా చూపించున్న బాగుండునేమో అనిపించింది. ఎందుకంటే పంజాబ్ ఎపిసోడ్ కంటే ముందు కలకత్తాలో జరిగిన మారణ హోమం గురించి చూపిస్తారన్నమాట.అది మాత్రం అంత హార్డ్ హిట్టింగ్ గా అనిపించలేదు. అంటే అక్కడ ఎమోషన్ ఓకే ఓకే అన్నట్టుగా వర్క్ అవుట్ అయ్యింది. మోస్ట్లీ ఏంటంటే ఇదొక పొలిటికల్ డ్రామా కింద తెరకెక్కించారన్నమాట. కాకపోతే రెండు దేశాలు విడిపోతున్నాయి రెండు మతాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మారణ హోమం జరుగుతుంది అన్నప్పుడు వాటిని స్క్రీన్ మీద కొంచెం ఇంపాక్ట్ ఫుల్ గా చూపించి ఉంటే ఆ ఎమోషన్స్ కి ఇంకా కొంచెం గట్టిగా కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళం అనిపించింది. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా డ్రామా మీద కాన్సంట్రేట్ చేయడం వల్ల ఆ పాయింట్ ని నెగ్లెక్ట్ చేశారేమో అని డౌట్ వచ్చింది. ఇంకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఆ కాన్సెప్ట్ యొక్క టోన్ కి తగ్గట్టుగా ఇచ్చారు. అది మాత్రం పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఓవరాల్ గా నాకైతే సిరీస్ నచ్చాయి మామా అంటే డ్రామాని ఎక్కువగా ఇష్టపడేవారు, అలాగే హిస్టరీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అని తాపత్రయ పడే వారు ఉంటే వాళ్ళకి కచ్చితంగా ఈ సిరీస్ చూడమని రికమెండ్ చేస్తున్నాను.ప్రెసెంట్ అయితే ఈ సిరీస్ sony లివ్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. టోటల్ గా 7ఎపిసోడ్స్ ఉన్నాయి. ఎపిసోడ్ 30 టు 40 మినిట్స్ అయితే ఉంటుంది. ఐ థింక్ కొంతమందికి ఇది కాస్త ప్రాపగండా ఏమో అన్న ఫీలింగ్ కూడా రావచ్చు.ఎందుకంటే ఈ మధ్య ఒక్కొక్కరికి ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వస్తుంది కదా సో అలాగే కొంతమందికి అలా అనిపించే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో మీ యొక్క ఒపీనియన్ ని ఖచ్చితంగా కింద కామెంట్స్ లో చెప్పండి