Finance

cibil score new rules – CIBIL స్కోర్ లో కొత్త మార్పు

RBI new rules on CIBIL score – రోజుకి 100 రూపాయల పెనాల్టీ

సిబిల్ స్కోర్ లో కొత్త రూల్స్ రోజుకు ₹100 రూపాయల పెనాల్టీ అంటూ ఇప్పుడిప్పుడే మనకొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అంటే సిబిల్ స్కోర్ కి సంబంధించి ఆర్బిఐ కొత్త నియమ నిబంధనలు అయితే రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి .వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుండి క్రెడిట్ రిపోర్ట్లను యాక్సెస్ చేసేటప్పుడు క్రెడిట్ రిఫరెన్స్ ఏజెన్సీలు నేరుగా కస్టమర్లతో కమ్యూనికేట్ చేయాలని ఆదేశించింది. అంటే కస్టమర్ల సివిల్ స్కోర్ విచారణ జరిగినప్పుడల్లా వారికి ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా తెలియజేయాలి. అయితే దీనికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు అయితే తీసుకొచ్చింది. ఇక దావా తిరస్కరణకు కారణాన్ని పేర్కొనే నియమం ఇక కస్టమర్ క్రెడిట్ అభ్యర్థన ఎందుకు తిరస్కరించబడిందో ఇప్పుడు బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్ సి లు వివరించాలి. ఈ స్పష్టత కస్టమర్లు తమ క్రెడిట్ యోగ్యతను ప్రభావితం చేసే అంశాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందని చెప్పబడింది .ఇక దీనికి సహాయం చేయటానికి ఆర్బిఐ అన్ని క్రెడిట్ సంబంధిత సంస్థలకు అభ్యర్థులను తిరస్కరించడానికి గల కారణాల యొక్క సమగ్ర జాబితాను రూపొందించాలని ఈ ఆర్థిక సంస్థలను ఆదేశించింది. ఇక కస్టమర్లు సంవత్సరానికి ఒకసారి ఉచిత పూర్తి క్రెడిట్ నివేదికకు అర్హులు. కస్టమర్లు తప్ప పూర్తి సిబిల్ స్కోరు మరియు చరిత్రను సంవత్సరానికి ఒక్కసారి సులభంగా యాక్సెస్ చేసేందుకు వీలుగా బ్యాంకులు మరియు nbfc ల వెబ్సైట్ లో లింకును అందించాలని క్రెడిట్ సంస్థలు ఆదేశించబడ్డాయి. ఈ ప్రయత్నం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది.

ఇక కస్టమర్ రక్షణ కోసం ఒక ముఖ్యమైన చర్యగా డిఫాల్ట్ ను నివేదించే ముందు కస్టమర్ కు తెలియజేయాలని ఆర్బిఐ క్రెడిట్ బ్యూరోలను ఆదేశించింది. దీంతో తప్పు యొక్క ముందస్తు నోటిఫికేషన్ ను sms లేదా ఈమెయిల్ ద్వారా తెలియజేయాలి. ఇది పరిస్థితిని సరిదిద్దటానికి వినియోగం దారులకు అవకాశం అయితే ఇస్తుంది. ఇక కస్టమర్ క్రెడిట్ రిపోర్టింగ్ ఫిర్యాదును 30 రోజుల్లాగా పరిష్కరించకపోతే క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీ రోజుకు ₹100 జరిమానా చెల్లించాలి. ఇక ఇష్యూ రిజల్యూషన్ ప్రక్రియ కోసం ఆర్బిఐ నిర్దిష్ట కాల పరిమితిని నిర్దేశించింది. ఏదైనా ఫిర్యాదులను క్రెడిట్ బ్యూరోలకు నివేదించడానికి రుణదాతలకు 21 రోజుల సమయం అయితే ఉంది. అదే సమయంలో సమస్యను పరిష్కరించడానికి బ్యూరోకి అదనంగా తొమ్మిది రోజుల సమయం అయితే ఉంటుంది. ఇక ఆర్బిఐ యొక్క ఈ చర్యలు నిరంతర క్రెడిట్ రిపోర్ట్ యొక్క పారదర్శకత మరియు జవాబుదారితనాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్నాయి. కస్టమర్లకు మరింత భద్రత మరియు స్వస్థతను అందిస్తుంది. ఈ నిబంధనలతో వ్యక్తులు తమ క్రెడిట్ సమాచారాన్ని మెరుగ్గా యాక్సెస్ చేయగలరు మరియు రుణ తిరస్కరణ వెనుక గల కారణాలను అర్థం చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *