Telangana Road Tax on EV vehicles
100% exemption Road tax for EV vehicles -Telanganaలో భారీగా తగ్గిన EV ధరలు
ఈవి కస్టమర్లకి శుభవార్త అండి స్పెసిఫిక్ గా చెప్పాలంటే తెలంగాణలో ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాలు కొంటున్నారో వాళ్ళకి అసలు శిశులైన శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల మీద యొక్క రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో పూర్తిగా రిజిస్ట్రేషన్ కాస్ట్ ని అయితే తొలగించడం జరిగింది. అంటే ఇక మీదట ఎలక్ట్రిక్ వాహనాలు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో కొంటారో రిజిస్ట్రేషన్ కాస్ట్ అయితే ఉండదన్నమాట. దీనివల్ల తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కునే కస్టమర్స్ కి ఎటువంటి ఉపయోగం, పూర్తి సమాచారం తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం యొక్క ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారు అయితే ఒక సంచలన అనౌన్స్మెంట్ అయితే చేశారన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 18 వ తారీకు 2024 వ సంవత్సరం నుంచి 2026 సంవత్సరం డిసెంబర్ 31 వ తారీకు వరకు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కునే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీస్ ఏమి కట్టాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అంటే రిజిస్ట్రేషన్ చార్జీలు అయితే ఉండవు అన్నమాట .
మరి దీనివల్ల తెలంగాణ ప్రజలకి ఎటువంటి ఉపయోగం ఉంటుంది.. ఫస్ట్ ఉదాహరణకి మనకి టూ వీలర్ కేటగిరీ చూసుకుంటే ఆల్రెడీ ఎలక్ట్రిక్ టూ వీలర్ సంబంధించిన కేటగిరీ మీద ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ టాక్స్ అనేది విధించట్లేదు. అంటే రిజిస్ట్రేషన్ ఫీస్ ఏమీ లేదన్నమాట సో ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద దాదాపుగా ₹20000 వరకు అయితే కస్టమర్స్ అయితే సేవ్ చేసుకుంటున్నారు. దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేసినట్టు అయ్యింది .ఇది ఎలక్ట్రిక్ టూ వీలర్స్ పరంగా ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా ఉన్న యొక్క అడ్వాంటేజ్. ఇప్పుడు మేజర్ అడ్వాంటేజ్ ఎవరికంటే ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్స్ అంటే ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కునే కస్టమర్స్ కి అనేది సూపర్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే మొన్నటి వరకు తెలంగాణలో వచ్చేసరికి ఎలక్ట్రిక్ కార్ల మీద రోడ్ టాక్స్ ఉండేది. ఆ రోడ్ టాక్స్ ని కూడా స్లాబ్ లు బట్టి ఉండేది. బట్ ఏపీ లో ఏంటంటే ఎలక్ట్రిక్ కార్ల మీద రోడ్ టాక్స్ లేదన్నమాట. సో దాంతో ఏమయ్యేది అంటే ఎలక్ట్రిక్ కార్ల రేట్లు తెలంగాణలో కొంచెం ఎక్కువగా అనిపించేది. బట్ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ ఫీజు ని తొలగించడం ద్వారా ఎలక్ట్రిక్ కార్లు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి వర్త అన్నమాట .ఎంత రేటు తగ్గుతుంది అంటే మొన్నటి వరకు ఎలక్ట్రిక్ కార్ల రేటు ఒక 10 లక్షల లోపు షోరూమ్ కాస్ట్ ఉన్న కార్ యొక్క రేట్ మీద రిజిస్ట్రేషన్ ఫీస్ అనేది 11% గా ఉండేది అలానే ₹10 లక్షల నుంచి 20 లక్షల లోపు ప్రైస్ ఉన్న కార్లు ఎవరైతే కొంటారో దాని మీద రిజిస్ట్రేషన్ ఫీస్ అనేది 14% చెల్లించాల్సి ఉండేది. ఇక దానికన్నా పైన ఏదైతే 20 లక్షల ఎక్స్ షోరూమ్ కాస్ట్ కన్నా ఎక్కువ రేటు ఉన్న ఎలక్ట్రిక్ కార్ల మీద రిజిస్ట్రేషన్ ఫీజు 15% గా చెల్లించాలన్నమాట.
అంటే దాని వల్ల ఎలక్ట్రిక్ కార్ల మీద రిజిస్ట్రేషన్ ఫీ దాదాపుగా ఐదు నుండి ₹6 లక్షల ఎడిషనల్ గా పే చేసేవారు. రిజిస్ట్రేషన్ ఫీజు ఉండేది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, రిజిస్ట్రేషన్ ఫీస్ తొలగించేశారు కాబట్టి దాదాపుగా ₹6 లక్షల వరకు డబ్బులు అనేది ఆదా చేసుకోగలుగుతారు. ఈ టైం లో ఎవరైతే ఎలక్ట్రిక్ కార్ కొనుంటారో అంటే నవంబర్ 18 వ తారీకు నుంచి ఇక మీదట రిజిస్ట్రేషన్ ఫీజు ఏమి ఉండదు కాబట్టి ఎలక్ట్రిక్ కార్లు యూసర్ కి మేజర్ రిలీఫ్ వచ్చిందన్నమాట. మొత్తం కేటగిరీలు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎలక్ట్రిక్ టు వీలర్స్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్స్ ప్రైవేట్ ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రిక్ లైట్ గూడ్స్ క్యారియర్స్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు ఈవెన్ ఎలక్ట్రిక్ బస్సుల మీద కూడా ఎటువంటి రోడ్ టాక్స్ మరి రిజిస్ట్రేషన్ ఫీస్ అయితే ఉండదన్నమాట. సో ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద అయితే ఇప్పటికే కస్టమర్స్ దాదాపుగా ₹20000 వరకు సేవ్ చేసుకుంటున్నారు.అదైతే కొనసాగుతుంది.దాంతో పాటు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల మీద దాదాపుగా మనకి ₹6 లక్షల అయితే సేవింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ప్రీవియస్ గా కూడా ఎక్కడ కూడా రోడ్ టాక్స్ గాని రిజిస్ట్రేషన్ ఫీస్ గాని తెలంగాణ ప్రభుత్వం కూడా లేదు సో ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది అన్నమాట.
ఇక స్పెసిఫిక్ గా ఎలక్ట్రిక్ బస్సుల విషయానికి వస్తే గనక ఎలక్ట్రిక్ బస్సులు ఎవరైతే తెలంగాణ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం నుంచి కొన్ని బస్సులు అయితే కొనుగోలు చేసి నడుపుతున్నారు. దానికి ఎలాగో లైఫ్ టైం ఓవరాల్ గా ఇది రెండు సంవత్సరాలు కాదు. లైఫ్ టైం అసలు ఎటువంటి రోడ్ టాక్స్ రిజిస్ట్రేషన్ ఫీస్ అయితే ఉండదన్నమాట. బట్ ఎవరైతే ఎలక్ట్రిక్ బస్సు ని కమర్షియల్ పర్పస్ గా యూస్ చేస్తారు అంటే కొని కమర్షియల్ గా యూస్ చేస్తారో సెపరేట్ ప్రైవేట్ ఓనర్షిప్ నడుపుతారో వాళ్లకైతే మాత్రం రెండు సంవత్సరాల పాటు ఇస్తున్నారు. బట్ ఎవరైతే ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి వాటిని కమర్షియల్ పర్పస్ యూసేజ్ కోసం కాకుండా ఎవరైతే వాళ్ళ ఎంప్లాయిస్ పరంగా గాని కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాడుకుంటే గనక వాళ్ళకి కూడా రెండు సంవత్సరాల పాటు ఎటువంటి రోడ్ టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీస్ అయితే ఉండదన్నమాట. ఓవరాల్ గా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో పొల్యూషన్ తగ్గించాలి పొల్యూషన్ అరికట్టాలి అనే ఒక ఉద్దేశంతో అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అన్నమాట. ఒక మంచి నిర్ణయం అన్నమాట. తెలంగాణ ప్రభుత్వానికి అయితే కృతజ్ఞతలు తెలుపుతాం .