Electric

lapa x electric scooter price ,specifications,features in Telugu

lapa x electric scooter price – కొత్త కాన్సెప్ట్ ,న్యూ డిజైన్

భారతదేశ మార్కెట్ లోకి ఒక సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో చాలా వింతలు అయితే ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లైట్ వెయిట్ గా ఉంటుంది కానీ పవర్ ఫుల్ గా ఉంటుంది. అప్ టు 240 km వరకు రేంజ్ ఇస్తామని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు మీ ఫింగర్ ప్రింట్ తో ఆన్ చేయొచ్చు అంట ,అంతే కాదు ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు కొనుక్కుంటే మీకు స్మార్ట్ ఫోన్ కూడా అవసరం లేదంట. మరి ఏంటి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి సమాచారం అండి ఈరోజు తెలుసుకుందాం నమస్తే. రీసెంట్ గా బెంగళూరులో జరిగిన ఒక టెక్ ఎక్స్పో లో ఒక నాలుగు సంవత్సరాల ఈవి స్టార్టప్ కంపెనీ అయిన లాపా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ లాపా ఎక్స్ ని అయితే అక్కడ అన్వీల్ చేయడం జరిగిందన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడగానే చాలా డిఫరెంట్ గా అయితే అనిపించింది. అక్కడ పర్టికులర్ ఎక్స్పో అయితే మాత్రం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో కంపెనీ వాళ్ళు చెప్పడం ఇదొక మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు. కంప్లీట్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ అంతా కూడా స్టార్టింగ్ ఫ్రమ్ చాసిస్ నుండి అలానే మోటార్ కంట్రోలర్ అన్నీ కూడా ఇక్కడే తయారు చేసామని చెప్తున్నారు. ఇటు వచ్చి బ్యాటరీ ప్యాక్ లో ఉన్న సెల్స్ ని మాత్రం వేరే చోట నుంచి సోర్స్ చేసుకున్నాం అని చెప్తున్నారు. అలానే కంపెనీ వాళ్ళు చెప్తుంది ఇంకో క్లెయిమ్ ఏంటంటే ఇది భారతదేశపు మొట్టమొదటి కార్బన్ ఫైబర్ చాసిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు .మునిపెన్నడు కూడా భారతదేశ మార్కెట్ లో ఇలా పూర్తిగా కార్బన్ ఫైబర్ చాసిస్ తో తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ లేదు తమదే ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు. ఈ కార్బన్ ఫైబర్ చాసిస్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుందన్నమాట. దీని యొక్క చాసెస్ ని జస్ట్ లిఫ్ట్ చేయొచ్చు. చిన్న థర్మాకోల్ షీట్ లాగా లేపేసినంత ఈజీగా లేపేయొచ్చు అన్నమాట. అంత లైట్ వెయిట్ ఉంటుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. బట్ లైట్ వెయిట్ ఉంటుంది కానీ స్ట్రెంత్ మాత్రం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఫ్రంట్ అంతా కూడా యూనిక్ గానే కనిపిస్తుంది. మరీ పెద్ద స్కూటర్ లాగా కనిపించదు కాదు ఒక మీడియం సైజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లైటింగ్ కానివ్వండి డిజైనింగ్ కానివ్వండి ఏరో డైనమిక్ డిజైన్ కింద కనిపిస్తుంది అన్నమాట. అలానే యూనిక్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ లో విషయాలు చూసుకున్నట్లయితే సింగిల్ సైడ్ స్వింగ్ ఆర్మ్ అనేది యూస్ చేసామని చెప్తున్నారు. ఇది ఇండస్ట్రీలో ఫస్ట్ టైం అయినట్టుగా మెన్షన్ చేస్తున్నారు. దాంతో పాటుగా రేర్ సైడ్ చూసినట్లయితే మోనో షాక్ సస్పెన్షన్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ లో అయితే యూస్ చేస్తున్నారు. ఇక మెయిన్ టెక్నికల్ స్పెక్స్ చూసినట్లయితే ఈ స్కూటర్ లో pms మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. హై పర్ఫార్మెన్స్ మోటార్ అని చెప్తున్నారు. బట్ స్పెసిఫిక్ గా దాని యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ రివీల్ చేయలేదు కానీ దీని యాక్సిలరేషన్ చూస్తే మాత్రం హై పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. 0 నుండి 40 km వేగాన్ని కేవలం 25 సెకండ్లు చేరుకుంటుందంట. ఇలా జరిగితే భారతదేశపు మోస్ట్ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ యాక్సిలరేషన్ ఫిగర్స్ చూసిన తర్వాత ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ మినిమం చూస్తే ఒక 80 టు 100 km పర్ అవర్ టాప్ సీడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలానే స్కూటర్ లో ఇంకొక యూనిక్ పాయింట్ ఏం చెప్తున్నారంటే జనరల్ గా త్రోటల్ ఏదైతే ఉందో నార్మల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి రౌండ్ షేప్ త్రోటల్ ఉంటుంది. బట్ వీళ్ళ త్రోటల్ చూసినట్లయితే ట్రయాంగిల్ షేప్ లో ఇస్తున్నారన్నమాట మరింత గ్రిప్ ఆఫర్ చేస్తది అని చెప్తున్నారు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఈ స్కూటర్ యొక్క రేంజ్ మార్కెట్ లో ఎప్పుడూ వినని విధంగా 6 kw బ్యాటరీ ప్యాక్ ని అయితే వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్లు యూస్ చేస్తున్నారంట. కంపెనీ వాళ్ళు క్లీన్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ 240 కమ్. ఇక రియల్ రేంజ్ చూసుకున్నట్లయితే 170 నుండి 180 km వరకు రియల్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి వీళ్ళు ఇన్ఫైనైట్ డిస్ప్లే అనేది యూస్ చేస్తున్నారు. అంటే వీళ్ళ యొక్క స్క్రీన్ డిస్ప్లే సైజు 12.3 అంగుళాలు అన్నమాట అంటే చాలా హ్యూజ్ అన్నమాట .ఒక టాబ్లెట్ కన్నా పెద్ద సైజు అనేది వీళ్ళ స్క్రీన్ అనేది స్కూటర్ మీద అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ స్క్రీన్ మీద మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిఫరెంట్ రైడ్ మోడ్స్ అనేవి చూడవచ్చు .అలానే నావిగేషన్ ఫీచర్స్ చూడొచ్చు. టెంపరేచర్ వివరాలు చూడొచ్చు. మ్యూజిక్ కంట్రోల్స్ చూడొచ్చు అన్నమాట .ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ డిస్ప్లే మీద చూడొచ్చు. అలానే వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఓన్ చేసుకుంటే అసలు మీరు ఫోన్ కొనాల్సిన అవసరం లేదు కూడా అని చెప్తున్నారు. బట్ అది కొంచెం పర్సనల్ విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫోన్ అనేది మనం బెడ్ రూమ్ లోకి గాని ఎక్కడికైనా తీసుకెళ్లి కొంచెం ప్రైవేట్ గా అయితే వాడుకుంటాం. బట్ స్కూటర్ అనేది అలా కాదు పబ్లిక్ లోనే యూస్ చేయాలి. బట్ వీళ్ళ పర్స్పెక్టివ్ ఏంటంటే ఫోన్ లో ఆల్మోస్ట్ ఫోన్ నే ఇందులో పెట్టేసాము. అంత పెద్ద టాబ్లెట్ ఉంది కాబట్టి సెపరేట్ గా మీరు వాడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా వీళ్ళు అయితే చెప్తున్నారు.

ఈ స్కూటర్ లో ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటంటే ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉందన్నమాట. స్కూటర్ కి కీ ఉండదని చెప్తున్నారు కీ లెస్ స్టార్ట్ అది కూడా ఫింగర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆపరేట్ చేయాలని చెప్తున్నారు. బట్ చూడాలి మరి ఇది కాంప్లికేషన్స్ వస్తాయా మరి సజావు గాని ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఎంతవరకు కొత్త టెక్నాలజీ కాదు అని చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే 35 l బట్ పర్టిక్యులర్ గా స్కూటర్లు షేప్ చూస్తే మరి ఎక్కడ పెడతారు ఆ బూట్ స్పేస్ అనేది .మనం ఓవరాల్ గా ఫైనల్ గానే చూడాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్ డీటెయిల్స్ యాస్ ఆఫ్ నౌ అయితే బట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది. వీళ్ళు ప్రెసెంట్ చెప్తున్న లాపా ఎక్స్ అని ఏదైతే ఉందో ఫోర్త్ ప్రోటోటైప్ అని చెప్తున్నారు. ఫైనల్ వేరియంట్ వచ్చేసి 2025సంవత్సరం మిడ్ లో మార్కెట్ లో తీసుకొస్తామని చెప్తున్నారు. దానికన్నా ముందు ఫస్ట్ క్వార్టర్ లోనే 2025 ఫస్ట్ క్వార్టర్ లోనే దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు .ఇక ప్రైస్ విషయానికి వస్తే ₹140000 నుండి ₹230000 ప్రైస్ సెగ్మెంట్ లో ఉంటుందని చెప్తున్నారు. మొత్తం మూడు రకాల రేంజ్ వేరియంట్స్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి తీసుకొస్తారంట. ఇప్పటి వరకు రివీల్ చేసిన డీటెయిల్స్ అండి ఒకటైతే మనం బెంగళూరు చెందిన ఈ స్టార్టప్ ని అయితే అప్రిషియేట్ చేయాలి.. కాస్త యూనిక్ డిజైన్ తో అయితే మార్కెట్ లోకి వస్తున్నారు కొత్త టెక్నాలజీ మరి ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనేది వన్స్ ఇది లాంచ్ అయిన తర్వాత అయితే మనం చూడొచ్చు మీరు అనుకున్నట్టుగా ఈ లాపా ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది .ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ చూసిన తర్వాత మీలో ఎంతమంది ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటున్నారు. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తే మీరు స్కూటర్ తీసుకుందాం అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *