Best Uncapped Players In IPL 2025 Auction Telugu
Top Uncapped Players In IPL 2025 Auction Telugu
ఐపిఎల్ ఎంతో మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ కి లైఫ్ ని ఇచ్చింది. ఇన్ఫాక్ట్ ఎంతో మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఐపిఎల్ లో వాళ్ళ వర్త్ ప్రూవ్ చేసుకొని ఇండియాకి ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే లాస్ట్ ఇయర్ ఐపిఎల్ లో ఎంతో మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఎవరు ఊహకు అందకుండా దుమ్ము లేపారు .ఈసారి 2025 ఐపిఎల్ ఆక్షన్ లో కూడా కొంతమంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ పంట పండబోతుంది. అయితే 2025 ఐపిఎల్ ఆక్షన్ లో ఏ అన్క్యాప్డ్ ప్లేయర్స్ డిమాండ్ లో ఉండబోతున్నారు అనేది డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అన్ క్యాప్డ్ ప్లేయర్స్ ఏ రాబోయే ఫ్యూచర్ స్టార్స్ అవుతారు.ఇక్కడ అన్ క్యాప్డ్ ప్లేయర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళ వల్లనే టీం బ్యాలెన్స్ గా ఉంటుంది. ఒక టీం స్ట్రాంగ్ గా లేదా వీక్ అనేది కేవలం క్యాప్డ్ ప్లేయర్స్ ఏ కాదు అన్ క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ కూడా డిసైడ్ చేస్తారు. మరి అన్ క్యాప్డ్ ఇండియన్ బెస్ట్ సిక్స్ ప్లేయర్స్ ఇప్పుడు రాబోతున్నారు. నెంబర్ వన్ ఆశుతోష్ శర్మ నా దృష్టిలో ఈ ఐపిఎల్ ఆక్షన్ లో ఎక్కువ డిమాండ్ లో ఉండే టాప్ బ్యాటర్ ఆశుతోష్ శర్మ .లాస్ట్ ఇయర్ పంజాబ్ కింగ్స్ ఆశుతోష్ ని కొన్నప్పుడు ఎవ్వరికీ అతని గురించి తెలవదు. కానీ టీం లో ఛాన్స్ వచ్చినప్పటి నుండి అతని క్యాలిబర్ ఏంటో చూపెట్టాడు . బ్యాట్ కి బాల్ తాకితే అది స్టాండ్స్ లోకి వెళ్లి పడేది .ఇండియన్ హార్డ్ హిట్టర్ అనే పేరు కూడా వచ్చింది. అశుతోష్ శర్మ కి బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ ని ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ఒక సిక్స్ కొడతాడు. అది ఇంకా నా మైండ్ లో నుండి వెళ్ళట్లేదు. ఇక ఆశుతోష్ శర్మ లాస్ట్ ఆడిన 11 మ్యాచెస్ లో 189 రన్స్ కొట్టాడు 27 యావరేజ్ ఉంది అండ్ స్ట్రైక్ రేట్ చూస్తే ఏకంగా 167ఉంది.
ఒక ఇండియన్ అన్ క్యాప్డ్ ప్లేయర్ కి ఒకే సీజన్ లో ఇంతటి స్ట్రైక్ రేట్ అంటే మామూలు విషయం కాదు. యాక్చువల్ గా ఈసారి పంజాబ్ కింగ్స్ వాళ్ళు అశుతోష్ శర్మని రిటర్న్ చేసుకుంటది అనుకున్నారు. కానీ అశుతోష్ శర్మ లాంటి ఇండియన్ ఫినిషర్స్ ఐపిఎల్ లో తక్కువ ఉన్నారు అందుకే అశుతోష్ శర్మ ఈసారి ఐపిఎల్ ఆక్షన్ లో దుమ్ము లేపబోతున్నాడు. నెంబర్ టు సమీర్ రిజ్వి .సమీర్ రిజ్విని లాస్ట్ ఇయరే సిఎస్కే 8 క్రోర్స్ పెట్టి కొన్నది అసలు సిఎస్కే లాంటి టాప్ టీం ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్ పైన ఇంత పైసలు ఎందుకు ఇన్వెస్ట్ చేశారని చాలా మంది క్వశ్చన్ చేశారు. కానీ సమీర్ రిజ్వి కూడా సిఎస్కే కి అనుకున్నంత పర్ఫార్మ్ చేయలేదు. ఆడిన ఎయిట్ మ్యాచెస్ లో 51 రన్స్ కొట్టాడు .యావరేజ్ కూడా 12.75 ఉంది స్ట్రైక్ రేట్ 118 ఉంది. కానీ ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ లో క్వాలిటీ లేకుంటే సిఎస్కే లాంటి టీం బిడ్ చేయదు. సిఎస్కే ని 8 క్రోర్స్ పెట్టుకున్నారంటే సమీర్ రిజ్వి కి టాలెంట్ కి కొదవే లేదు. లాస్ట్ ఇయర్ మంచి పర్ఫార్మెన్సెస్ ఇయ్యకున్నా గాని రిజ్వి పైన ఈసారి ఆక్షన్ లో పైసల వర్షం కురవడం అయితే కాయం. ఎందుకంటే సమీర్ రిజ్వి యూపీ లీగ్ లో దుమ్ములే ఇన్నింగ్స్ లు ఆడారు .అంతేకాక మంచి స్పిన్నర్ గా రిజ్వి చాలా యూస్ఫుల్ అవుతాడు. రైనా కే రిజ్వి నచ్చిండంటే అర్థం చేసుకోండి రిజ్వి ఎలాంటి క్యాలిబర్ ఉన్న ప్లేయర్. సో రిజ్వి ని మీరు ఏ టీం లో చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెంబర్ త్రీ వైభవ అరోరా. వైభవ అరోరా అయితే కే కెఆర్ కి గత కొంత కాలంగా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. న్యూ బాల్ తో స్వింగ్ చేయగలిగే సత్తా అతనిది . వైభవ్ మాత్రం రెండు వైపులా స్వింగ్ చేయగలిగే సత్తా ఉన్న ప్లేయర్. ఇన్ఫాక్ట్ కే కెఆర్ కి అన్క్యాప్డ్ ప్లేయర్ గా రిటెన్షన్ లిస్ట్ లో ఉండడం చాలా మంది అనుకున్నారు. కానీ వైభవ అరోరా మాత్రం తొందరలోనే ఇండియాకి ఆడతాడు. దాంట్లో డౌటే లేదు. సో ఇండియన్ బౌలర్స్ కి ఈ ఆక్షన్ లో చాలా డిమాండ్ ఉండబోతుంది. వైభవ అరోరా ఈ ఆక్షన్ లో ఏ టీం కి వస్తే బాగుంటదో కామెంట్ చేయండి. నెంబర్ ఫోర్ హర్ప్రీత్ బ్రార్. బ్రార్ అయితే పంజాబ్ కింగ్స్ కి గత ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుండి బిగ్గెస్ట్ అసెట్ లాగా ఉన్నాడు. టీం లో ఎంతో మంది ప్లేయర్స్ వస్తూ వెళ్లారు కానీ బ్రార్ అయితే పంజాబ్ కింగ్స్ తోనే తన ఐపిఎల్ జర్నీ కంటిన్యూ చేశాడు. పంజాబ్ కింగ్స్ బ్రార్ ని రిటర్న్ చేసుకోకపోవడం అయితే చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. కానీ బ్రార్ లాంటి క్వాలిటీ స్పిన్నర్ అండ్ బెస్ట్ ఫినిషర్ .ఐపిఎల్ లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కి చాలా డిమాండ్ ఉంటుంది . అందులోనూ బ్రార్ కి చాలా ఐపిఎల్ ఎక్స్పీరియన్స్ ఉంది అతను ఇప్పటికే 41 మ్యాచెస్ ఆడాడు 25 వికెట్స్ తీసిండు 7.91 ఎకనామి ఉంది .నెంబర్ ఫైవ్ నేహాల్ వదేరా. అసలు నేహాల్ వదేరా ని చూస్తే అన్కేయాప్డ్ ప్లేయర్ గానే ఎందుకు ఉన్నాడు. ఇప్పటికే ఇండియా కి డెబ్యూ చేయాలిగా అనిపిస్తుంది .అట్లాంటి క్యాలిబర్ ఉంది. వదేరా కి ముంబై ఇండియన్స్ ఎలాంటి యంగ్ స్టర్స్ మీద ఇన్వెస్ట్ చేసినా వాళ్ళు ఇండియా కి పక్కా ఆడతారు. ఇన్ఫాక్ట్ ఇండియా కి ఫ్యూచర్ స్టార్స్ అవుతారు. నేహాల్ వదేరా కి కూడా ఇండియన్ కాల్ తొందరలోనే వస్తుంది. కానీ ఈసారి నేహాల్ వదేరా ని ముంబై ఇండియన్స్ వాళ్ళు రిటర్న్ చేసుకోలేదు. వాళ్ళ కోర్ టీం ని ఉంచుకున్నారు.
కానీ ముంబై దగ్గర అన్క్యాప్డ్ ఆర్టిఎం కార్డు ఉంది. నేహాల్ వదేరా మీద తప్పకుండా ముంబై ఇండియన్స్ వాళ్ళు ఆర్టిఎం కార్డు వాడే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ముంబై ఇండియన్స్ ఇంట్రెస్టెడ్ లేకున్నా గాని నేహాల్ లాంటి క్వాలిటీ ప్లేయర్ ని తప్పకుండా వేరే టీమ్స్ తీసుకుంటే అందులో డౌటే లేదు. మినిమమ్ 8 క్రోర్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. తను ఆడిన 20 మ్యాచెస్ లో 350 ప్లస్ రన్స్ ఉన్నాయి. 23 యావరేజ్ ఉంది అండ్ 140 ప్లస్ స్ట్రైక్ రేట్ ఉంది .చాలా క్వాలిటీ ప్లేయర్. మిడిల్ ఆర్డర్ లో ఇంతటి స్ట్రాంగ్ ప్లేయర్ ఉంటే ఏ టీమ్ అయినా స్ట్రాంగ్ అవుతుంది సో నేహాల్ వదేరా ఎంతకు అమ్ముడిపోతాడు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెంబర్ సిక్స్ రఘువంశి కే కెఆర్ లో లాస్ట్ ఇయర్ తనకు ఛాన్స్ వస్తే తన టాలెంట్ ఏంటో చూపెట్టాడు . అగ్రెసివ్ నెస్ అండ్ కామ్నెస్ రెండు కలిసిన ప్లేయర్స్ చాలా తక్కువ ఉంటారు. అన్ క్యాప్డ్ ప్లేయర్స్ లో ఈ క్వాలిటీస్ అస్సలకే ఉండవు కానీ కేవలం 20 ఇయర్స్ కే తన మార్క్ క్రియేట్ చేసుకున్న రఘువంశి ఈసారి ఆక్షన్ లో కోటీశ్వరుడు అవ్వడం అయితే కాయం. కే కెఆర్ వాళ్ళు లాస్ట్ ఇయర్ కప్ కొట్టడానికి రఘువంశి కూడా కొంతవరకు కారణమే. నితీష్ రాణ లేనప్పుడు టీం కి అండగా ఉన్నాడు చాలా క్రూషియల్ నాక్స్ ఆడారు .గౌతం గంభీర్ అండ్ షారుక్ ఖాన్ అయితే రఘువంశి ని చాలా పొగిడారు .అయితే రఘువంశి ఆడిన 10 మ్యాచెస్ లో 163 రన్స్ ,23 యావరేజ్ ఉంది అండ్ 155 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసాడు .వీళ్లే కాక ఇంకా చాలా మంది టాప్ అన్ క్యాప్డ్ ప్లేయర్స్ ఈ ఆక్షన్ లో ఉన్నారు .