November EV Scooters Sales Report 2024 In telugu
November EV Scooters Sales Report 2024 – పడిపోయిన OLA అమ్మకాలు
ఇంకొక్క 3000 స్కూటర్లు ఎక్కువ అమ్ముంటే tvs ola కంపెనీని ఫస్ట్ పొజిషన్ నుండి కిందికి నెట్టి tvs ఫస్ట్ పొజిషన్ లోకి వెళ్ళేది. నవంబర్ నెలకి సంబంధించిన ఈవి సేల్స్ రిపోర్ట్ అనేది వచ్చేసింది. ఏ కంపెనీ ఎన్ని బండ్లను సేల్ చేసింది ఓవరాల్ గా ఎన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండియాలో సేల్ అవుతున్నాయి అండ్ టాప్ 10 కంపెనీస్ ఏవో తెలుసుకుందాము. ఇక ఈ నవంబర్ నెలలో మొత్తంగా 191513 ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముడయ్యాయి. అక్టోబర్ తో కంపేర్ చేసుకుంటే నవంబర్ నెలలో సేల్ అనేది కొంచెం తగ్గింది. అక్టోబర్ నెలలో 219000 ఎలక్ట్రిక్ వాహనాలను సేల్ చేసాము. అప్పుడు పండగలు ఉన్నాయి కాబట్టి మనకి రెండు లక్షలు దాటింది. నవంబర్ నెలలో పండగలు కాస్త తగ్గాయి కాబట్టి 191000 ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి మన ఇండియాలో సేల్ అయ్యాయి. ఈ 191000 ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ వచ్చేసరికి 119000 అక్టోబర్ తో కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ అనేవి నవంబర్ లో 18% తగ్గాయి. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఈ క్యాలెండర్ ఇయర్ లో గడిచిన 11 మంత్స్ లో మన ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ అనేవి వన్ మిలియన్ యూనిట్స్ ని కంప్లీట్ చేసుకున్నాయి. ఇంతవరకు ఏ క్యాలెండర్ ఇయర్ లోనూ వన్ మిలియన్ యూనిట్స్ ని టచ్ చేయలేదు. ఈ 2024 లో కేవలం 11 మంత్స్ లోనే వన్ మిలియన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేసాము. మొత్తంగా 2024 లో ఫస్ట్ 11 మంత్స్ లో 1070000 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేసాము. ఈ ఇయర్ ఎండ్ అయ్యే వరకు 12 లేదా 13 లక్షల దగ్గర మార్కెట్ క్లోజ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ అంచనా అయితే వేస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఓవరాల్ సేల్స్ అనేవి ఇయర్ ఇయర్ కి పెరుగుతూనే వెళ్తున్నాయి. ఈ నవంబర్ మంత్ లో మన ఇండియాలో సేల్ అయిన అన్ని ఆటోమొబైల్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి 6%, ప్రీవియస్ గా ఇది 4% 5% ఉండేది. ఫైనల్ గా అన్ని ఆటోమొబైల్స్ లో ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఒక షేర్ అనేది 6% కి వచ్చింది. ఇది నెమ్మదిగా పెరిగి పెరిగి 2030 సంవత్సరం కల్లా 30% కి రీచ్ అవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ చాలా గట్టిగా ట్రై చేస్తుంది.
ఇప్పుడు నవంబర్ లో జరిగిన ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ లో టాప్ 10 కంపెనీస్ ఏవో చూసేద్దాము. టెన్త్ ప్లేస్ లో ఎలక్ట్రిక్స్ ev ఉంది. ఈ ఎలక్ట్రిక్స్ ఈవి వాళ్ళు అక్టోబర్ మంత్ లో 991 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని సేల్ చేస్తే, నవంబర్ మంత్ లో కేవలం 534 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ అంటే అక్టోబర్ తో కంపేర్ చేసుకుంటే నవంబర్ లో వీళ్ళ గ్రోత్ వచ్చేసరికి -46% .నవంబర్ లో ఎలక్ట్రిక్ సివి యొక్క మార్కెట్ షేర్ వచ్చేసరికి 0.57%. నైన్త్ ప్లేస్ లో కైనెటిక్ గ్రీన్ ఉంది. వీళ్ళు అక్టోబర్ లో 1444 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని సేల్ చేస్తే నవంబర్ మంత్ లో 1095 యూనిట్స్ ని సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ -24% .అండ్ కైనెటిక్ గ్రీన్ యొక్క మార్కెట్ షేర్ వచ్చేసరికి 1 .17% ఎయిత్ ప్లేస్ లో బిగోస్ కంపెనీ ఉంది వీళ్ళు అక్టోబర్ లో 2022 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని సేల్ చేస్తే నవంబర్ మంత్ లో 1878 ఎలక్ట్రిక్ టూల్స్ ప్లస్ ని సేల్ చేశారు వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి -7% వీళ్ళ మార్కెట్ షేర్ వచ్చేసరికి 2% .సెవెంత్ ప్లేస్ లో రివోల్ట్ కంపెనీ ఉంది వీళ్ళు అక్టోబర్ లో 952 ఎలక్ట్రిక్ బైక్స్ ని సేల్ చేస్తే నవంబర్ మంత్ లో 1994 ఎలక్ట్రిక్ బైక్స్ ని సేల్ చేశారు. రివోల్ట్ వాళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి 109%. సో అక్టోబర్ తో కంపేర్ చేసుకుంటే నవంబర్ లో వీళ్ళ సేల్ అనేది పెరిగింది. రీసెంట్ గానే రీవోల్ట్ కంపెనీ వాళ్ళు అబ్రాడ్ లో కూడా వాళ్ళ షోరూమ్స్ ని ఓపెన్ చేశారు. రీవోల్ట్ యొక్క మార్కెట్ షోర్ వచ్చేసరికి 2 .12 2%. సిక్స్త్ ప్లేస్ లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అంటే యాంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు అక్టోబర్ మంత్ లో 3989 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేస్తే నవంబర్ మంత్ లో 4468 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని సేల్ చేశారు వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి +12% అండ్ యాంపియర్ యొక్క మార్కెట్ షేర్ 4.76%. ఫిఫ్త్ ప్లేస్ లో హీరో మోటోగో వాళ్ళు ఉన్నారు అంటే వీదా ఎలక్ట్రిక్ స్కూటర్స్ .వీళ్ళు అక్టోబర్ మంత్ లో 7223 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేస్తే నవంబర్ మంత్ లో 5952 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ -18% .హీరో మోటోకా యొక్క మార్కెట్ షేర్ 6.3%. ఫోర్త్ ప్లేస్ లో ఏథర్ ఉంది. ఏథర్ వాళ్ళు అక్టోబర్ లో 16156 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేస్తే నవంబర్ మంత్ లో కేవలం 12741 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ -21% .ఏథర్ యొక్క మార్కెట్ షేర్ వచ్చేసరికి 13.5%. థర్డ్ ప్లేస్ లో bajaj కంపెనీ ఉంది bajaj వాళ్ళు అక్టోబర్ లో 28360 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని సేల్ చేస్తే నవంబర్ మంత్ లో కేవలం 18403 యూనిట్స్ నే సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ -35% అండ్ బజాజ్ యొక్క మార్కెట్ షేర్ వచ్చేసరికి 19% .సెకండ్ ప్లేస్ లో tvs ఉంది. tvs వాళ్ళు అక్టోబర్ మంత్ లో 28302 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని సేల్ చేస్తే నవంబర్ మంత్ లో 26163 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ -7% .tvs యొక్క మార్కెట్ షేర్ వచ్చేసరికి 27% .ఫస్ట్ ప్లేస్ లో ola నే ఉంది ola వాళ్ళు. అక్టోబర్ మంత్ లో 41 1775 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ని సేల్ చేస్తే నవంబర్ మంత్ లో కేవలం 29191 యూనిట్స్ ని సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ -30% .ola యొక్క మార్కెట్ షేర్ వచ్చేసరికి 31% .
మీరు గమనిస్తే tvs వాళ్ళు నవంబర్ మంత్ లో 26000 యూనిట్స్ ని సేల్ చేస్తే ola వాళ్ళు 29000 యూనిట్స్ ని సేల్ చేశారు. అంటే tvs కంపెనీ ఒక్క 3000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని ఎక్కువ సేల్ చేసుంటే చరిత్రలో మొదటిసారిగా వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో ఉండే వాళ్ళు. ola సెకండ్ ప్లేస్ కి పడిపోయేది. ఒక్క మూడు వేల స్కూటర్స్ తో వెనకబడి tvs రెండో ప్లేస్ లో ఉండిపోయింది బట్ చూద్దాము ఇంకా టైం అనేది అయిపోలేదు డిసెంబర్ లో tvs కి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. ola సేల్స్ ఇప్పుడు పడిపోతున్నాయి కాబట్టి. tvs వాళ్ళు గనక కాన్సంట్రేషన్ పెట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేస్తే కచ్చితంగా వాళ్ళు ఫస్ట్ ప్లేస్ కి అయితే వస్తారు.